ఫేస్ బుక్లో రాష్ట్ర బడ్జెట్ను ఉద్దేశించి అభ్యంతకర పోస్టు పెట్టారంటూ న్యాయవాది ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆదివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర బడ్జెట్ తీరును వ్యంగ్యంగా విమర్శిస్తూ సీఎం జగన్ ఫొటో మార్ఫింగ్ చేసి, ఇబ్బందికరంగా దుస్తులు తగిలించి ఫేస్ బుక్లో పోస్టు చేశారు. పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని న్యాయవాది ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.