వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ..... జగనన్న పాలనలో అవినీతి రహిత సమాజాన్ని చూస్తున్నాం. ఎలాంటి వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందడం ఇప్పుడే చూస్తున్నాం. జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో మన తలరాతలు మారాయి. మన బతుకులు, మన కుటుంబాలు, మన పిల్లల తలరాతలు మారాయన్నది నిజం. చట్టసభల్లో ఎప్పుడూ అడుగుపెట్టని కొన్ని కులాలను పార్లమెంటు వరకు తీసుకెళ్లిన ఘనత జగనన్నది. అంబేడ్కర్, పూలే ఆదర్శాలతో మన చేతులు పట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మన బతుకులు బాగుపడతాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలు.. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. జగనన్న లాంటి నాయకుడు మరొకరు లేరు. మళ్లీ రారు. జగనన్నను నమ్మాం. నమ్మినందుకు ఆయన మనకు ఎంతో మేలు చేసి చూపారు. గతంలో చంద్రబాబును నమ్మినందుకు...ప్రజలను ఎంత మోసం చేశారో అందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన రాజకీయ నాయకుడు, మోసకారి చంద్రబాబు అని అన్నారు.