ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది పేదల రాజ్యం. బీసీల రాజ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 09:29 AM

వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.... ఇది పేదల రాజ్యం. బీసీల రాజ్యం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యం. ఇప్పుడు మన తలరాతలు మారుతున్నాయి. మన తాతల కాలం పోయింది. మన పెద్దలు కుల వివక్షతో ఎన్ని బాధలు పడ్డారో మనకు తెలుసు. పనుల కోసమే మనల్ని అగ్రవర్ణాల వారు వాడుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మనకు జగనన్న ఉన్నారు. ఇప్పుడు మనం బండి పైకి ఎక్కి.. ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. జగనన్న మనల్ని కాపాడాడు. మనం ఆయన్ను కాపాడుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కథలు చెప్పి మోసం చెయ్యడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు. వారిని తరిమేద్దాం. వారికి ఓట్లేయకండి. జగనన్నను గెలిపించుకుందాం. అణగారిన వర్గాల ప్రభుత్వాన్ని నిలుపుకొందాం అని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com