గత వందేళ్లుగా సక్రమమైన రీతిలో భూసర్వే జరగకపోవడం వలన లక్షలాది ఎకరాలు అసైన్డ్‌భూములుగానే ఉండి.. లబ్ధిదారులకు వాటిపై హక్కుల్లేకుండా ఉన్న పరిస్థితిని మనం చూశాం. గతంలో సర్వేవ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉన్నందున రైతులు, రైతుకూలీలు కూడా చాలా నష్టపోయారు అని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గ్రామాల్లో అనేక వివాదాలకూ భూసమస్యలే ప్రధాన కారణంగా అందరం చూశాం. బ్రిటీషు ప్రభుత్వంలో ఆనాడు సర్వే సెటిల్‌మెంట్ జరగడమే గానీ.. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఎవరూ ఏ ప్రభుత్వం దానిజోలికి వెళ్లలేదు. అయితే, ఎవరూ చేయలేని ధైర్యం చేసి వందేళ్ల చరిత్రను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు నేడు మార్చారు. మూడంచెల సర్వేతో భూముల వివరాలు, లబ్ధిదారులతో సహా కొలిక్కితెచ్చి వాటిపై వారికి సర్వ హక్కులు కల్పించడమనేది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసానికి జగన్ గారు శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షలాది ఎకరాల భూములపై హక్కులు పొందిన పేదలకు భారీస్థాయిలో మేలు జరిగింది. దీనిద్వారా లబ్ధి పొందిన మెజార్టీ ప్రజలు బడుగు, బలహీనవర్గాలవారే అని అన్నారు.