మత్స్యకారుల సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వెళితే వారిని ఫినిష్ చేస్తానని బెదిరించి అవమానపరిచిన ఘటన ఇప్పటికీ అందరినీ కలిచి వేస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అయన మాట్లాడుతూ... మత్స్యకారులు జీవనాధారమైన తిీర ప్రాంత అభివృద్ధికి జగన్ ధృడ సంకల్పంతో ఉన్నారని, ఇందులో బాగంగానే అన్ని జిల్లాల్లో హార్బర్ లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, రూ. 150 కోట్లతో ఆధునిక హార్బర్ విశాఖలో త్వరలోనే అందుబాటులోకి రానుందని మంత్రి అప్పలరాజు వివరించారు. నాలుగున్నరేళ్లలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు హార్బర్ ల నిర్మాణం చేపట్టడానికి నిధులు కూడా మంజూరు చేసారని వివరించారు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఏనాడైనా సరే మత్స్యకారుల కోసం ఒక్క హార్బర్ ను అయినా సరే నిర్మాణం చేపట్టారా అని ప్రశ్నించారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో 10 హార్బర్ లు, 4 పోర్టులు ఇచ్చి మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని జగన్ చాటి దేశానికి చెప్పారని వెల్లడించారు. ఏ పథకానికి నోచుకోని ఆ చంద్రబాబు పాలన ఎక్కడ, అర్హులైన వారందరికీ ఇళ్లకే వచ్చి లబ్ధి చేకూరుస్తున్న జగన్ పాలన ఎక్కడ, ఎంత వ్యత్యాసం ఉన్నదో ప్రజలు ఆలోచించాలని మంత్రి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రులు ఏదైనా కావాలనుకుంటే ఉద్యమాలు, పోరాటాలు చేసేవారని, కానీ ఇప్పుడు జగన్ హయాంలో ఆ అవసరం లేకుండా విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక ఉత్తరాంధ్రకు స్వాతంత్రం వచ్చిందన్నారు.