గూడూరు గాంధీనగర్ వద్ద రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాకేష్ (20), గుంటూరుకు చెందిన పావనిగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి ఒకే చోట బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.