చిలకలూరిపేట నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 27, 88, 00ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామన్నారు.