ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టన్నెల్ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ ఉత్తరాఖండ్‌కు వచ్చారు. సిల్కియారా టన్నెల్ వద్ద ఆయన ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ బాగానే సాగుతోందని, తమ బృందం మొత్తం ఇక్కడే ఉందని, సమస్యకు పరిష్కారాన్ని చూపుతామని ఆయన తెలిపారు.