అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్మిల్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8శాతం ఓట్లు రాగా.. సెర్గియో మాసాకు 44.2శాతం ఓట్లు పోలయ్యాయి. లాలిబర్టాడ్ అవాంజా నేత అయిన జేవియర్మిల్లా ఎన్నికల ఎన్నికల ప్రచారంలో అర్జెంటీనాలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అర్జెంటీనా ఎన్నికల సమయంలో ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం పెద్ద సమస్యలు పెను సవాల్‌గా మారాయి.