ఉంగుటూరు మండలంలో 22 గ్రామాలలో స్వమిత్వ సర్వే కార్యక్రమం పూర్తయిందని ఉంగుటూరు ఈవోపీఆర్డి షేక్ షంషిద్ధిన్ తెలిపారు. సోమవారం ఆయన ఉంగుటూరులో మాట్లాడారు. మిగిలిన ఐదు గ్రామాల్లో స్వమిత్వసర్వే చురుగ్గా జరుగుతుందన్నారు. సర్వేలో ప్రతి ఇంటి సరిహద్దులు కొలిచి యజమానికి శాశ్వత హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామ వాలంటరీలు సర్వే చేశారన్నారు.