వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.... గత ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలిచ్చి వెబ్సైట్లోంచి తీసేసింది. రైతులకు 10 శాతమో 20 శాతమో రుణమాఫీ చేసి తూచ్ అనిపించారు. బంగారం తాకట్టు నుంచి విడిపిస్తామని తూచ్ అనిపించారు. 2019 నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాం. పేదలు ఎవరి దగ్గరకీ వెళ్లి దేహీ అని అడగాల్సిన పని లేదు.పథకాలు ఇంటికే తెచ్చి ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలని జగన్ గారు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఒక్క పదవిలో కచ్చితంగా మాట ఇచ్చి సామాజిక సాధికారత పాటించారు అని తెలియజేసారు.