విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో యూట్యూబర్ నానీకి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తన భార్య సీమంతం కోసం ఆ ప్రాంతంలో పార్టీ ఏర్పాటు చేశాడని, ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని తొలుత వార్తలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసలు సీసీటీవీ ఫుటేజ్ చూడగా ప్రమాదంలో అతడి ప్రమేయం లేదని తేలింది. అయితే ఈ ప్రమాదంలో 43 బోట్లు పూర్తిగా కాలిపోయాయి. మరో 15 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa