సీఎం జగన్పై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. "నీటి కోరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయి. 414 మండలాల్లో కరవు ఉంటే.. సీఎం తగ్గించి చెబుతున్నారు. సీఎం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు దాపురించాయి. రైతులకు నష్టపరిహారం, రుణాలు మంజూరు చేయాలి. ప్రజా సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తడంలో వైసీపీ విఫలమైంది. జగన్ ఢిల్లీకి వెళ్లేది ఆయన కేసుల కోసమే." అని ఆయన వ్యాఖ్యానించారు.