సీఎం జగన్కు వ్యవసాయం పట్ల అవగాహన లేదని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో జగన్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. తక్షణమే 400పైచిలుకు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితిపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో వైసీపీ విఫలమైందని అన్నారు.