రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులే ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తూ పరస్పర విమర్శలతో రాజకీయాల్లో హీటు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బికనేర్ ఎంపీ అర్జున్‌రామ్ మేఘ్వాల్తో కలిసి ప్రధాని మోదీ సోమవారం రాత్రి బికనేర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.