కులగణన సర్వేకు సంబంధించి సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇచ్చే నిమిత్తం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సోమవారం మాస్టర్ ట్రైనర్లను నియమించారు. పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు యద్దనపూడి మండలాలకు బాపట్ల ఆర్డిఓ రవీందర్, పర్చూరు, కారంచేడు మండలాలకు పర్చూరు ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్, ఇంకొల్లు మండలానికి డి. టి ఎం. వి సుబ్బారావు, చినగంజాం మండలానికి ఏ. ఎస్. ఓ శివప్రసాద్ మాస్టర్ ట్రైనర్లు గా నియమితులయ్యారు.