నేను ఎవరి జోలికి వెళ్ళను, కక్ష సాధింపులకు దూరంగా ఉంటాను. కానీ ఈసారి ఎన్నికల్లో గెలిచాక ఇద్దరినీ మాత్రం వదిలిపెట్టను. వారి సంగతి తేలుస్తా అంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. ఆ ఇద్దరూ ఎవరన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఒంగోలులో సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పత్రికల్లో తనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని, తాను మేయర్ ను తిట్టాననటం అవాస్తవమన్నారు.