ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 11 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ ఏడాది మార్చిలో సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.