అత్యాచార కేసులో జైలుకెళ్లిన ఓ నిందితుడు బాధితురాలిపై కోపం పెంచుకున్నాడు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తన సోదరుడితో కలిసి బాధితురాలిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా వెంటాడి మరీ చంపేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.