ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో బటన్ నొక్కి మొత్తం 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకు రూ.69,000 అందనుంది.