ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే సాక్షిలో రాసిన రాతలు రోతగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయాలన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారు అని అన్నారు. న్యాయ వర్గాల్లో విస్మయం అని రాశారని, సాక్షి ఇష్టానుసారంగా రాయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా కేసు వస్తే ఒక రకంగా.. లేదంటే మరో రకంగా మాట్లాడుతారని విమర్శించారు.