విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగి అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోట్లకు కచ్చితంగా నష్టాన్ని అంచనా వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నేడు విశాఖ ఫిషింగ్ హార్బర్లో ప్రమాద ఘటన స్థలాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. నష్టపోయిన బోట్లకు కచ్చితంగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వేట చేసుకుని సరుకుతో వచ్చిన బోట్లు కూడా దగ్ధ మయ్యాయని... వేటకు సిద్ధంగా ఉన్న బోట్లు కూడా కాలిపోయాయని తెలిపారు. నష్టపరిహారం అందించడంలో తాత్సారం చేయకుండా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోట్లపై ఆధార పడి జీవిస్తూ ఉపాధి కోల్పోయిన సిబ్బందిని ఆదుకోవాలని అన్నారు.