ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరువు మండలాలలో ఏమి చర్యలు తీసుకున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 03:20 PM

జగన్ కేసులు వాదించడానికి వందల కోట్లు లాయర్లకి ఇస్తున్న జగన్ కృష్ణా జలాలపై కోర్టుకి వెళ్లలేకపోతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ప్రభుత్వం కరువు మండలలుగా ప్రకటించిన ప్రాంతాల్లో తీసుకొన్న చర్యలు ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబును తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి శాఖాపరమైన అంశాలపై మాట్లాడం లేదన్నారు. షెడ్యూల్ 9, 10 ప్రకారం రాష్ట్రానికి లక్ష కోట్లు రావాలన్నారు. జగన్ మొద్దు నిద్ర విడవడానికి 50 నెలలు సమయం పట్టిందని వ్యాఖ్యలు చేశారు. తెలివి తక్కువ, చేతకాని, చేయలేని ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు.. భవిష్యత్‌లో చూడమన్నారు. పొలవరం డ్యాంని జగన్ బ్యారేజ్ చేశారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com