ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా పాలన సాగిస్తున్నారని గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని సంస్కరణలను తీసుకొచ్చి మహిళలకు భరోసా కల్పిస్తున్నారని జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం మెప్మా కార్యాలయం నందు మంగళవారం పట్టణ సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.