రైతులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను తగులబెట్టే అంశం పరిశీలనలో ఉందని పేర్కొంటూ...పంజాబ్ రైతులకు మద్దతు ప్రకటించింది. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పంట వ్యర్థాలను కాల్చకుండా రైతులకు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి సూచించింది.