దేశ ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే ముంబయిలోని జేజే ఆస్పత్రిని కూడా పేల్చేస్తానని హెచ్చరించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకొన్నాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, ఇంటరాగేషన్ చేస్తున్నారు.