ఓ యువకుడు తనను కాటేసిన నాగుపామును ఆసుపత్రికి తీసుకువెళ్లి, తనకు వైద్యం చేయాలని కోరాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌కు చెందిన సూరజ్ అనే యువకుడిని ఇంటివద్ద పాముకాటు వేయడంతో భయపడకుండా ఆ పామును సంచిలో బంధించాడు. చికిత్స కోసం వెంటనే మీర్జాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్‌పై వెళ్లాడు. ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని, పాముని చూపుతూ ఇంజెక్షన్ ఇవ్వాలని కోరాడు. వైద్యులు యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa