ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి మాధవి దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ అందజేశారు.