2023-24 ఖరీఫ్ లో జిల్లాలో ధాన్యం సేకరణకు పట్టిష్టవంతమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఖరీఫ్లో ధాన్యం సేకరణకు పటిష్టవంతమైన ఏర్పాట్లు గావించినట్లు తెలిపారు. ముఖ్యంగా గోని సంచులు కొరత లేకుండా ముందుగానే అవసరమైన పరిమాణంలో సిద్ధం చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa