ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలు అని, పార్లమెంటు ఎన్నికలు కాదని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎద్దేవా చేశారు. గతంలో అధికారంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మొహాన్ని చూపుతూ ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసిన పనులు, గ్యారంటీలపై చర్చించే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.