టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇచ్చి హైకోర్టు పరిధి దాటిందన్న అదనపు అడ్వకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్కిల్ కేసులో చంద్రబాబు మినహా మిగతా వారంతా బయటే ఉన్నారన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. పొన్నవోలు ఏఏజీలా కాకుండా జగన్ ఏజెంట్లా మాట్లాడారని విమర్శించారు.