మంత్రి రోజా టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీవీ5 అసోసియేట్ ఎడిటర్ రాజేంద్రప్రసాద్, భాను ప్రకాష్ లపై నగిరి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం కేసులను మంగళవారం విచారణ చేపట్టారు. రాష్ట్ర మహిళ మంత్రిగా తన పై టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో చేసిన అభ్యంతర వ్యాఖ్యల పై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఐపిసి 499, 500 సెక్షన్లు కింద కేసులు నమోదు కాగా మంగళవారం న్యాయస్థాననికి హాజరయ్యారు.