ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో బుధవారం మహిళా సమైక్య కార్యాలయం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు అరటికోళ్లను పంపిణీ చేశారు. పెరటి కోళ్లు పెంపకం ద్వారా మంచి లాభాలు పొందాలని మహిళలకు జడ్పిటిసి సారే వెంకట నాయుడు, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి సూచించారు. కార్యక్రమంలో మహిళా సమైక్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.