అన్నాక్యాంటీన్లను ఎత్తేయడం దారుణమని, పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడం తప్పా అంటూ టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కేసుల నుంచి కాపాడుకోవడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఢిల్లీలో రాష్ట్రం పరువు పోయేలా వంగివంగి సాష్టాంగ నమస్కారాలు చేసున్నారని ఎద్దేవాచేశారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి ఎం ఊడపీకావని ప్రశ్నించారు. రాష్ట్రనికి రైల్వేజోన్ తెచ్చావా?.. ప్రత్యేక హోదా సాధించావనా, వైజాగ్‌కి మెట్రో రైలు ప్రాజెక్టు తెచ్చావనా, పోలవరం పూర్తిచేసేవనా ఎందుకు ఈ రాష్ట్రానికి నీ అవసరమని మండిపడ్డారు. బ్రిటీష్ వారిని ఎదిరిచినట్లు జగన్‌ను ఎదిరించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు.