పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తాడేరుకు చెందిన పురెళ్ల సోమరాజు ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ నెల 19న బైక్పై ఎక్కించుకొని తాడేరుకు తీసుకెళ్లారు. అక్కడే తాళి కట్టి అత్యాచారానికి పాల్పడ్డారు.
బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సోమరాజుపై పలు కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్ మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు.