రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి చేపట్టనున్న కులగణన వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. కులగణన సర్వే వివరాల నమోదుకు వలంటీర్ల సెల్ ఫోన్ లో స్పెషల్ యాప్ ను పొందుపరిచారు.
ఈ సర్వేలో భాగంగా వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు.