వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ....ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఎంత గొప్పగా జరుగుతోందో మనమందరం చూస్తున్నాం. దివంగత నేత రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పథకాల ఒరవడిని మరింత పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. చంద్రబాబు ప్రభుత్వ పనితీరును, ఈ ప్రభుత్వం పనితీరును ఒక్కసారి బేరీజు వేసుకోండి. సంక్షేమపథకాలు అందాలంటే నాడు ఎంతో కష్టపడాల్సివచ్చేది. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటి చెంతకే సంక్షేమపథకాలు అందుతున్నాయి.మనందరికీ సీఎం జగన్ చేసిన మేలు మరిచిపోవద్దు. మళ్లీ ఆయన్ను సీఎం చేసుకుని కృతజ్ఞతలు చాటుదాం అని పిలుపునిచ్చారు.