వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.... ఈరోజు బనగానపల్లె జనసంద్రమైంది. నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడే ఉన్నట్టుంది. జగనన్న సైనికులమైన బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలమైన మేము జగనన్న కటౌట్ పెట్టుకుని వచ్చాం. ఆ మాత్రానికే ఇంతమంది వచ్చారంటే...ఇక జగనన్న వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లవుతోంది. సామాజిక సాధికారత నినాదంగానే ఉండిపోయింది. అన్ని రాష్ట్రాల్లో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. పోయారు. కానీ ఎవరూ అణగారిన వర్గాల గురించి ఆలోచించలేదు. ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సాధికారతను ఒక విధానంగా మార్చేశారు. వెనుకబడిన వర్గాలను వెన్నుతట్టి, చెయ్యిపట్టి నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు బీసీ,ఎస్సీ,ఎస్టీ ,మైనార్టీలున్నారంటే ..అది జగనన్నే చలవే. వెనుకబడిన కులాలను ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకున్న సందర్భం లేదు. ఇక బాబుగారి గురించి చెప్పాల్సిన పనిలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుగారు ఏనాడు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల గురించి ఆలోచించలేదు. పైగా వారిని అవమానించారు. చులకన చేశారు. హేళనగా మాట్లాడారు. చంద్రబాబు అంత నీచంగా ప్రవర్తిస్తే...జగనన్న ఒక ఎస్సీ మహిళను హోంమంత్రిని చేశారు. ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం చేశారు. ఒక్కరంటే ఒక్క మైనార్టీ.. బాబు కేబినెట్‌లో మంత్రిగా లేరంటే ఎంత సిగ్గు చేటు. తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా మైనార్టీని తీసుకున్న ఘనత జగనన్నదే. ఇదే బనగానపల్లె నియోజకవర్గంలో78,431మంది మైనార్టీ లబ్దిదారులకు నేరుగా రూ.201.43 కోట్లు సంక్షేమపథకాల ద్వారా అందించిన ఘనత జగనన్నదే. నాన్‌డీబీటీ ద్వారా 7,598మంది మైనార్టీలకు 11.22 కోట్లు అందించారు. జగనన్న వల్లనే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన ధర్మం అని అన్నారు.