వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ....... స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి జరగాల్సి ఉన్నా సాధ్యం కాలేని పరిస్థితిలో రాజ్యాంగానికి గౌరవం లేని దుస్థితిలో , తన నాలుగున్నరేళ్ల పాలనలో అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసి సామాజిక సాధికారతకు చోదక శక్తిగా జగన్ నిలిచారన్నారు. వీధిలో కాలువ, రోడ్డు, బిల్డింగ్ కడితేనే అభివృద్ధా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం అభివృద్ధా అన్నది చెప్పాలని కోరారు. ప్రజల డబ్బును చంద్రబాబు తమ ఖాతాల్లో వేసుకొన్నారని, జగన్ బడుగు, బలహీన వర్గాల చేయూతనిచ్చేలా వారి ఖాతాల్లో వేస్తున్నారన్నారు. పేదరికం దేనికీ అడ్డంకి కారాదన్నది సీఎం జగన్ అభిమతమని స్పీకర్ తమ్మినేని ఉద్ఘాటించారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవమే ఈ సామాజిక సాధికార యాత్రని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎన్నో పార్టీలు పాలించినా సరే ఇంత జవాబుదారీతనం, పాదర్శకత ఎన్నడూ లేదని, సీఎం గా జగన్ హాయాంలో ఎటువంటి మధ్యవర్తులు, అవినీతి లేకుండా నేరుగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎవరిని అడిగి రాజధానిగా అమరావతిని ఏర్పాటుచేశారు. తాను రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, తన కుటుంబీకులకు, కుల వర్గాలకు లబ్ధి చేయడానికే అమరావతిని రాజధానిగా అర్థరాత్రి ప్రకటించారని విమర్శించారు. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన గౌరవం నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. మరోసారి సీఎంగా జగన్ గెలుపు ఉత్తరాంధ్ర నుంచే ఆరంభం కావాలన్నారు.