వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ...... ప్రజలందరినీ సరి సమానంగా చూడాలని పరితపించే సీఎం జగన్ సామాజిక సాధికారతను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ప్రతీ పేదవాడిని ఆర్థికంగా బలంగా నిలబెట్టేందుకు దమ్ముతో ధైర్యంగా రాజకీయంగా తలెత్తుకుని తిరిగేలా నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఉద్ఘాటించారు. పేదల జీవన స్థితిగతులను మార్చేందుకు సక్షేమం చేపట్టి భారతదేశానికే నాంది పలికిన ఘనత జగన్ దేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక ప్రజా నాయకుడు జగన్ అని, శాసనసభ, మండలి, రాజ్యసభ, కేబినెట్ లోనూ కూడా అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత పాలకులు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటే సీఎం జగన్ తనను నమ్ముకున్న వర్గాలకు కేటాయించారని, 9 రాజ్యసభ స్థానాల్లో 4 బీసీలకు కేటాయించిన చరిత్ర జగన్ దని గుర్తు చేసారు. మానవ తప్పిదంగా ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే సీఎం జగన్ హుటాహుటిన స్పందించి బాధితులకు నూటికి 80 శాతం సాయం చేస్తామని ప్రకటన చేసి తానున్నాననే అభయమిచ్చారన్నారు. హుదూద్ బాధితులకు ఇప్పటికీ పరిహారాన్ని టీడీపీ అందించలేకపోయిందని, మత్స్యకారులకు ప్రమాదం జరిగితే వెంటనే సాయమందించేలా చర్యలను జగన్ చేపట్టారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబు చేస్తే, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు జగన్ ముందడుగు వేస్తున్నారన్నారు.