వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మాట్లాడుతూ...... మత్స్యకారుడునైన నన్ను సీఎం మూడోసారి ఎంఎల్ఏ చేయడానికి సంకల్పించారని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. సామాజిక సాధికారతను తన భుజస్కంధాలపై జగన్ వేసుకుని అమలు చేస్తున్నారు. గత పాలకులు కులాలను విభజించి బానిసలుగా చేసుకుని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే, సీఎం జగన్ మాత్రం అన్ని జాతులకు సమ ప్రాధాన్యతనిస్తూ అగ్ర వర్ణాలకు ధీటుగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సుల మేరకు నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తక్షణమే పరిష్కరించే బాధ్యత తనదేనంటూ ప్రజల సమక్షంలో ప్రమాణం చేసారు.