శిఖండి రాజకీయాలు మానండి చంద్రబాబూ అంటూ వైయస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూచించారు. ఆమె మాట్లాడుతూ..... ఈ రాష్ట్రానికి జగన్‌గారే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిసి పనికి మాలిన వాళ్లు జగనన్న ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ గారు. మీకు దమ్ముంటే ఆయనపై మాట్లాడండి. రాజకీయ పోరాటం చేస్తున్నది జగన్ గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై పోరాటం చేయండి. మీకు నిజంగా దమ్ముంటే మీ భువనేశ్వరి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా.. ఆమెతో మాట్లాడించండి. లేదంటే బ్రాహ్మణి గారితో మాట్లాడించండి. మేం ఏం సమాధానం చెప్తామో చూడండి. భారతమ్మ గారి కాలిగోటితో కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆకాశం లాంటి భారతమ్మపై బురద జల్లాలంటే అగ్నికి ఆçహుతి కావడం ఖాయం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే దింపిన నాటి నుంచి చంద్రబాబుకు ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అలవాటు. ఒక శిఖండిలా వెనకుండి ఆడవాళ్లను అడ్డుపెట్టి చంద్రబాబు బాణాలు వేస్తూ ఉంటాడు. దానిలో భువనేశ్వరి, బ్రాహ్మణి, పురందేశ్వరి లాంటి వాళ్లను వాడుకుంటున్నారు అని అన్నారు.