ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ప్రమాదం జరిగిన 48 గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది.
జీవనాధారం కోల్పోయిన హమాలీలు, చిరువ్యాపారులకు ఒక్కో బోటుకు 10మంది చొప్పున మొత్తం 490 మందికి వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.10వేలు చొప్పున అందించారు.