సొంత డబ్బుతో మట్టి రోడ్డు వేయించి ఔదర్యాన్ని చాటుకున్నాడు వైఎస్సార్సీపీ నేత హీరాపురం ఫయాజ్ భాష. తాడిపత్రి 2వ వార్డు ప్రజలు బైపాస్ రోడ్డులోకి వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. పలు మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. సమస్యను ప్రజలు ఫయాజ్ భాష దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన గురువారం సొంత డబ్బుతో మట్టి రోడ్డు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు.