హెచ్ఐవీ/ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చైతన్య రూరల్ ఎడ్యూకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ తిప్పేస్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు గురువారం హిందూపురం పట్టణంలోని కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శోభ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.