తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరినీ అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27, 28 తేదీల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్నప్ప యాదవ్ కోరారు. పెద్దపప్పూరు మండల కేంద్రంలో రైతు సంఘం కార్యాలయంలో గురువారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.