ధర్మవరం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 25న శనివారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సౌజన్య కుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీడీఓ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే పనులపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa