తాడిపత్రి లో ఈనెల 27న జరుగునున్న సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. తాడిపత్రి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa