విడపనకల్ మండల పరిధిలోని గడేకల్లు గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి హెచ్. పెన్నయ్య ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల యందు ఎరువుల నిల్వలు, రికార్డులు తనిఖీ చేశారు. కొన్ని షాపుల్లో రికార్డులు ఎరువులు మరియు పురుగుమందులు సంబంధించి రికార్డులు చూపకపోవడం దాదాపు 2, 43, 325 రూపాయలు విలువ కలిగిన స్టాక్స్ విక్రయం నిలుపుదల చేశామని అధికారులు తెలిపారు.