నార్పల ఎంపీడీఓ కార్యాలయంలో ఈఓఆర్డీగా పనిచేస్తూ కుందుర్పి ఎంపీడీఓ గా ప్రమోషన్ పై వెలుతున్న లక్ష్మీ నరసింహను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు జరిగిన ఆత్మీయ వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా నార్పల సత్యనారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరావు, ఎంపీడీఓ దివాకర్, తహశీల్దార్ హరికుమార్, రాజశేఖర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.